విడిపోదామనుకుని కోర్టును ఆశ్రయించారు

విడిపోదామనుకుని కోర్టును ఆశ్రయించారు

న్యాయమూర్తి సబిత కౌన్సిలింగ్ తో తిరిగి ఒక్కటైన దంపతులు 

ముద్ర ప్రతినిది నాగర్ కర్నూల్:కుటుంబ కలహాలతో కోర్టును ఆశ్రయించిన దంపతులు న్యాయమూర్తి చేసిన కౌన్సిలింగ్ ద్వారా తిరిగి ఒకటైనారు. పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన ఎం . అనూష మరియు ఎం. రాముడు దంపతులకు 2022 డిసెంబర్ 4వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల కారణంగా వారు విడిపోవాలని నిర్ణయించుకొని నాగర్ కర్నూల్ లోని జిల్లా న్యాయ సేవా సంస్థలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. సబిత ఆధ్వర్యంలో మూడు వాయిదాలు అనంతరం శుక్రవారం  న్యాయమూర్తి చొరవతో ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా విడిపోదామనుకున్న జంటను ఒకటి చేశారు. 

 జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఫిర్యాదుదారులు ఇద్దరికీ సంస్థ కార్యాలయంలో పూల దండలు మార్పించి దంపతులను తిరిగి ఒకటి చేశారు . కాపురంలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజంగా ఉంటాయి. వాటిని ప్రేమతో, సున్నితంగా మన్నించుకుంటూ జీవిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని న్యాయమూర్తి ఒకటైన దంపతులకునచ్చ చెప్పిరు. దంపతులు ప్రేమగా కలకాలం పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని న్యాయమూర్తి దీవించారు.  కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూపరింటెండెంట్ దేవిక, సిబ్బంది పుష్పలత తదితరులు పాల్గొన్నారు.