మున్నూరు కాపులకు కార్పొరేషన్  అభినందనీయం

మున్నూరు కాపులకు కార్పొరేషన్  అభినందనీయం
  • మున్నూరు కాపు నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్
  • సీఎం రేవంత్ ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేల ఫ్లెక్సీలకు పాలాభిషేకం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కులస్తుల కోసం ప్రత్యేకంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్నూరు కాపు  సంఘం తాలూకా అధ్యక్షుడు తీగల సుభాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కులస్తుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సోమవారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుల్ల రాజేష్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం ప్రభుత్వాలను విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల లోపే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. మున్నూరు కాపు కులస్తులలో వెనుకబడిన వర్గాలకు ఈ కార్పొరేషన్ ఎంతో మేలు చేస్తుంది అన్నారు. మున్నూరు కాపులు అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, ప్రభుత్వానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వక్తలు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రెసిడెంట్.. తీగల సుభాష్-సెక్రటరీ పాలమూరు సతీష్,జగదీష్, ప్రవీణ్, పాప, మున్సిపల్ కౌన్సిలర్లు తీగల సురేంద్ర,పదమ్మ, వెంకటయ్య, నిరంజన్, తీగల దినేష్ , మణిదీప్ , రాజేష్ మున్నూరు కాపు యూత్ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు..