ఎంపీ అభ్యర్థి ఖరారుపై సీఎంను కలిసిన రాము   

ఎంపీ అభ్యర్థి ఖరారుపై సీఎంను కలిసిన రాము   

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని పార్టీకి దరఖాస్తు చేసుకున్న యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడిదల రాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తాను  దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి మిత్రమండలిలో చురుకుగా పనిచేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేసిన రాము యువజన కాంగ్రెస్లో వివిధ బాధ్యతలలో పనిచేసే కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రజా క్షేత్రంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పని చేయండి టికెట్టు అంశం అధిష్టానం చూసుకుంటుందని తెలిపారని కొడిదల రాము వివరించారు. రాబోయే ఎన్నికలలో స్థానికుడైన తనకు టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ శక్తులు అడ్డుకోలేవని ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు. లక్షలాది మంది యువత అన్ని వర్గాల సామాజిక ప్రజలు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారని రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిగా విజయం సాధించి ఈ ప్రాంత వాసుడిగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల గుండెల్లో నిలవాలని అప్పుడే విజయం సునాయాసం అవుతుందని అన్నారు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో విభజన కాంగ్రెస్ బలోపేతానికి పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా కృషి చేయడం జరిగిందని అన్ని నియోజకవర్గాలలో యువజన కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అన్ని కమిటీలు కూడా తన అభ్యర్థిత్వానికి అండగా నిలుస్తున్నారని వివరించారు