ఫ్యాక్షన్ రాజకీయాలు సహించం

ఫ్యాక్షన్ రాజకీయాలు సహించం
  • మర్రి నీ పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలి  
  • బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డా. అంబేద్కర్ గారి విగ్రహం వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎంజెఆర్ తుపాకులతో కలుస్తాను అని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు లో 2సార్లు ఎమ్మేల్యేగా గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా అనీ దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న నాగర్ కర్నూలు గడ్డమీద ఫ్యాక్షన్ రాజకీయాలను బిఎస్పీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తెలిపారు. కుచూకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వక ముందు గడ్డ పారలు, గొడ్డళ్లు అనీ మాట్లాడటం - నేడు ఎమ్మేల్యే తుపాకులతో కాలుస్తాను అనీ మాట్లాడటం హేయనియం అన్నారు.

నూటికి 99శాతం ఉన్న బహుజనులను మోసగించడమే అందరి లక్ష్యం అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా వివిధ పార్టీలలో ఉన్న బహుజనులు అంతా ఏకం కావాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఏకమై బహుజన రాజ్యాధికారం సాదించుకుందామని అన్నారు. తక్షణమే సీఎం కేసిఆర్ స్పందించి ఎమ్మేల్యేను పార్టీ నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 24గంటల్లో ఎమ్మేల్యే తన మాటలను వెనక్కి తీసుకోకపోతే అసెంబ్లీ స్పీకర్ ను, ఎన్నికల కమీషన్ ను కలిసి ఎమ్మేల్యేపై పిర్యాదు చేస్తామని అన్నారు. కాల్చిన, కొట్టిన, తిట్టిన దోపిడి వర్గాల నాయకులు అంతా ఒక్కటే అనే నిజాన్ని బహుజన బిడ్డలు గ్రహించాలని కోరారు.

బిఎస్పీ పార్టీ నాగర్ కర్నూల్ అసెంబ్లీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ, కులం మతం వర్గం పార్టీలతో సంబంధం లేకుండా నూటికి 99శాతం ఉన్న బహుజనుల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి రాంచందర్, అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, ఉపాధ్యక్షులు పరుశరామ్, కోశాధికారి ఆనంద్, మండలాల అధ్యక్షులు రాంచందర్, శివ శంకర్, వెంకటేష్ నాయకులు మంతటి శేఖర్, శివకృష్ణ, బాలనాగులు, అంజీ, శ్రీను, రామస్వామి, మధు, కన్నయ్య, శ్రీకాంత్, రాము, రాజు, నాగార్జునలు పాల్గొన్నారు.