కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో గోవిందరాజులు

కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో గోవిందరాజులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు గురువారం సందర్శించి తనిఖీలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి స్వగ్రామం ముఖ్యమంత్రి చదువుకున్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యా ప్రమాణాలను వసతులను కొనసాగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 

పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఈసారి మెరుగ్గా రావాలని ఆయా పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులకు సూచించారు.కొండారెడ్డిపల్లి గ్రామంలోని రెండు పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను ఆయన పరిశీలించారు.మన ఊరు మనబడి ద్వారా ప్రాథమిక పాఠశాలలో 16 లక్షల 41 వేల 985 రూపాయలతో కొనసాగుతున్న పనులను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 61 లక్షల 10వేల 910 రూపాయలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతి గదులు, డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్, మూత్రశాలలు, మేజర్, మైనర్ రిపేర్ పనులను ఆయన పరిశీలించారు.నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వెంటనే పూర్తి చేయాలని సూచించారు.గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం సియం చదువుకున్న పాఠశాలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలకు ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని గ్రామ ఉప సర్పంచ్, యువకులు డీఈఓ కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులకు డీఈవో సూచించారు.ఈ కార్యక్రమంలో వంగూరు మండల విద్యాధికారి శంకర్ నాయక్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్ పి సి ప్రసాద్ గౌడ్, వెంకటేశ్వర్ల శెట్టి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గ్రామ ఉపసర్పంచ్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.