కప్రాయపల్లి చెక్పోస్ట్ వద్ద నగదు పట్టివేత

కప్రాయపల్లి చెక్పోస్ట్ వద్ద నగదు పట్టివేత

 ఆత్మకూర్ ఎం ముద్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మండలంలోని కప్రాయపల్లి స్టేజి వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద అధికారులు వాహనాలను చెక్ చేస్తుండగా ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఓర్సు వేణు హైదరాబాదు నుండి స్వగ్రామం దత్తప్పగూడానికి వెళుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో లక్ష రూపాయలను తీసుకెళ్తుండగా అతని వద్ద నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీన పరుచుకున్న సొమ్ముకు తగిన ఆధారాలు చూపించి ఉన్నతాధికారుల నుండి సొమ్మును తీసుకోవచ్చునని టీం ఇంచార్జి శేఖర్ తెలిపారు తెలిపారు.