ఘనంగా హజ్రత్ బాలే షహీద్ దర్గా ఉర్సు

ఘనంగా హజ్రత్ బాలే షహీద్ దర్గా ఉర్సు

 ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని చెరువు కట్టపై వెలిసిన హజ్రత్ బాలే షహీద్ రహమతుల్లా అలే ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం దీపారాధనతో ఉత్సవాలు ముగిశాయి. గురువారం రాత్రి ఖాజీపుర వీధిలోని దర్గా ముతావల్లి మహమ్మద్ ఫయాజ్ నివాసం నుంచి గంధం ఊరేగింపుగా బయలుదేరింది. అంతకుముందు ఆయన నివాసంలో ఖవ్వాలి,ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.

అదేవిధంగా గంధం దర్గా వద్దకు చేరుకోగా భక్తి శ్రద్దల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో చాదర్ల సమర్పణ, ఫాతేహా ఖానీ అనంతరం ఖవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజులపాటు దర్గా వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లీలు మహమ్మద్ ఫయాజ్ ఖాన్, మహమ్మద్ అయాజ్ ఖాన్, ముస్లిం మత పెద్దలు మహమ్మద్ సాదిక్ పాషా నక్ష బంది, షేక్ యాఖూబ్ బావాజీర్,షేఖ్ అబ్దుల్లా బావాజీర్, జామియా నిజామియా ఆలిం మహమ్మద్ షాకీర్ సిద్దిఖి, మున్సిపల్ కౌన్సిలర్ లు మహమ్మద్ ఖాజా ఖాన్, మహమ్మద్ నిజాం లతోపాటు ముస్లిం మత పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.