జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: సోమవారం క్రిస్మస్‌ పండగని నాగర్ కర్నూల్ జిల్లాలో క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ జిల్లా ప్రజలకు సోమవారం పత్రికా ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, దయ, కరుణ, ప్రేమ, సహనం ప్రపంచానికి చాటిన ఏసు మార్గం అనుసరణీయమని, ప్రతిఒక్కరూ ఈ మార్గంలో నడవాలన్నారు.త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారన్నారు.

క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు,గొప్ప శాంతి దూతన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసు క్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలోని క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేసే జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ నుండి జిల్లాలోని క్రిస్మస్ సోదరులకు 5000 క్రిస్మస్ కానుకలను అందజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.అచ్చంపేట నియోజకవర్గంలో 2000 క్రిస్మస్ కానుకలు నాగర్ కర్నూల్ కల్వకుర్తి కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఒక్కో 1000 చొప్పున క్రిస్మస్ కానుకలు ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల ద్వారా కానుకలను అందజేయడం జరిగిందని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని రాజేశ్వరి తెలిపారు.భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ఆమె మైనార్టీ సంక్షేమ శాఖ తరపున జిల్లా ప్రజలకు తెలియజేశారు.