రైతులకు సాయం చేసిన డిగ్రీ విద్యార్థులు

రైతులకు సాయం చేసిన డిగ్రీ విద్యార్థులు

వర్షానికి తడవకుండా మార్కెట్ లో వరిధాన్యం కుప్పలను పేర్చి టార్పలిన్ కవర్ లను కప్పిన విద్యార్థులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రం సమీపంలో నెల్లికొండ మార్కెట్ యార్డు లో సాయంత్రం అకస్మాత్తుగా మేఘావృతం అవడంతో మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గమనించి ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డులోకి ప్రవేశించారు అనంతరం మార్కెట్ యార్డులో రైతులు ధాన్యాన్ని కుప్పలు వేస్తూ కవర్లను కప్పడానికి ప్రయత్నిస్తుండగా సుమారు 100 మంది విద్యార్థులు అక్కడి చేరుకొని రైతులకు సాయంగా వర్షానికి తడవకుండా ధాన్యాన్ని దగ్గరగా కుప్ప పోసి టార్పాలిన్ కవర్లను కప్పారు అప్పటికే వర్షం ప్రారంభమై చిరు జల్లులతో బారి ఈదురుగాలులతో కురుస్తూ ఉంది కాసేపటికి వర్షం నిమ్మదించడంతో రైతులు విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే విద్యార్థులు చేసిన పనికి రైతులు చేతులెత్తి ధన్యవాదాలు తెలిపారు రైతులు మాట్లాడుతూ సమయానికి విద్యార్థులు గనుక రాకపోయి ఉంటే వర్షం గనుక అలాగే కొనసాగింటే ధాన్యం మొత్తం నీటిపాలయ్యేదని ఆందోళనకు గురయ్యామని తెలిపారు సమయానికి విద్యార్థులు వచ్చి కొండంత సాయం చేశారని విద్యార్థులను రైతులు మెచ్చుకున్నారు విద్యార్థులు చేసిన కృషిని మార్కెట్ యార్డులోని రైతులు కొనియాడారు