గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరణ

గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరణ

ముద్ర. వీపనగండ్ల:- మండల పరిధిలోని గ్రామాలలో అర్హులైన విద్యుత్ వినియోగదారుల నుంచి గృహజ్యోతి పథకానికి దరఖాస్తులను తీసుకుంటున్నట్లు మండల విద్యుత్ ఏఈ భగవంతు నాయక్ తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది గృహ జ్యోతి పథకానికి సంబంధించి వివరాల కోసం ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు గృహజ్యోతి లబ్ధిదారుడు ప్రజా పాలనలో చేసిన దరఖాస్తు కు సంబంధించిన రసీదు, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, చరవాణి నెంబర్ ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చినప్పుడు వినియోగదారులు ఇంటి వద్ద లేకుంటే పూర్తి సమాచారాన్ని  మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో పైన చూపిన వివరాలను అందించి నమోదు చేయించుకోవాలని కోరారు.