జూపల్లి గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

జూపల్లి గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

ముద్ర.వీపనగండ్ల:-కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు ఏత్తం కృష్ణయ్య అన్నారు. కోల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి  అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేసి కొల్లాపూర్ ఎమ్మెల్యే గా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ను భారీ మెజారిటీతో గెలుపుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా వీపనగండ్ల మండల  ప్రజలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఏత్తం కృష్ణయ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు.