ఆర్టీసీ బస్సు,బైక్ డీ కొని ఒకరు మృతి

ఆర్టీసీ బస్సు,బైక్ డీ కొని ఒకరు మృతి
  • ఇద్దరికీ తీవ్ర గాయాలు

ముద్ర,పానుగల్:- ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొట్టుకోవడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన పానుగల్ మండల పరిధిలోని బండపల్లి స్టేజి వద్ద శనివారం చోటుచేసుకుంది. పానుగల్ ఎస్ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం పానుగల్ మండలం తెల్ల రాళ్లపల్లి తండాకు చెందిన మూడవత్ మహేష్ నాయక్,గౌతమ్ నాయక్ లు పని నిమిత్తం బైక్ పై పానుగల్ కు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా బండపల్లి స్టేజి వద్ద కొల్లాపూర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా కొల్లాపూర్ నుండి వనపర్తికి వస్తున్న ఆర్టీసీ బస్సుకు ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న ముడావత్ మహేష్(20) క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందగా బైక్ పై ఉన్న మరో వ్యక్తి గౌతమ్ నాయక్ ఎగిరి పడి అటుగా బైక్ పై వెళ్తున్న బండపల్లి గ్రామానికి చెందిన మొగిలి ఆంజనేయులు బైక్ పై పడడటంతో ఇద్దరికీ గాయాలు అయినట్లు ఎస్ఐ తెలిపారు.

గౌతమ్ నాయక్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే 108 ద్వారా వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వేణు తెలిపారు.