పోరాటాల చరిత్ర ఎర్ర జెండాది 

పోరాటాల చరిత్ర ఎర్ర జెండాది 
  • ఎర్రజెండా పోరాట ఫలితంగానే కార్మికులకు హక్కులు,చట్టాలు 
  • కార్మిక వ్యతిరేక విధానాలను  విడనాడాలి
  • మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ప్రభుత్వం
  • ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్

ముద్ర,పానుగల్:- ఎర్రజెండాది పోరాటాల చరిత్ర అని, ఆ జెండా నీడలో సమస్యల పరిష్కారం కోసం సంఘటితమై పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ పిలుపునిచ్చారు.పానుగల్ మండలంలోని కేతేపల్లి,తెల్లరాలపల్లి, వెంగలాయిపల్లి గ్రామాలలో సిపిఐ పార్టీ ఆద్వర్యంలో138వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కేతేపల్లి భగత్ నగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య ఎర్రజెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.అమెరికా దేశం చికాగోలో కార్మికులకు 24 గంటల పని దినం ఉండేది అన్నారు.ఎనిమిది గంటలు చేయాలని కార్మికులు పోరాటానికి దిగారన్నారు. పాలకుల కాల్పుల్లో పలువురు కార్మికులు చనిపోయారని,ఆ సందర్భంగా ఒక కార్మికుడు తన షర్టు ను తన శరీరం నుంచి కారుతున్న రక్తంతో తడిపి ఎగరవేశారని అదే ఈ ఎర్రజెండా అన్నారు. ఆ పోరాట క్రమంలోనే రోజుకు ఎనిమిది గంటల పని దినం వచ్చిందన్నారు.

ఎర్రజెండా పోరాట ఫలితంగా కార్మికులకు అనేక చట్టాలు, హక్కులు వచ్చాయన్నారు. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం తిరిగి 12 గంటల పని దినం ఇచ్చేందుకు కుట్ర చేస్తోందని తిప్పి కొట్టాలన్నారు. కార్మిక చట్టాలను కూడా పారిశ్రామిక వ్యక్తులకు అనుగుణంగా మారుస్తుందని, బిజెపి పేదల వ్యతిరేక కార్మికుల అనుకూల, మతతత్వ విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెడుతోందని, ఆకలి, అధిక ధరలు ,నిరుద్యోగం, పేదరికాన్ని విస్మరించిందన్నారు. పోరాటాల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డంగు కురుమయ్య, గ్రామపంచాయతీ వార్డ్ మాజీ సభ్యుడు పెంటయ్య, కాకం కాశన్న,కురువ హనుమంతు, చిన్న కురుమయ్య, పరశురాముడు, మాల కుర్మయ్య, చెన్నయ్య, హుస్సేన్, ఎల్లయ్య, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

తెల్ల రాళ్లపల్లిలో ఘనంగా మేడే

తెల్ల రాళ్లపల్లి బస్టాండ్ లో సీనియర్ నాయకులు లింగన్న అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి మాట్లాడారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎర్రజెండా పోరాటం వల్లనే పేదలకు  పథకాలు ఎర్రజెండా పోరాటం వల్లనే పేదలకు లభించాయన్నారు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు, అసైన్డ్ భూములు, రైతు రుణమాఫీ, ఉపాధి హామీ పథకం, రైతుబంధు తదితర పథకాలు ఎర్రజెండా పోరాటం వల్లనే వచ్చాయన్నారు. ప్రజలు గమనించి ఎర్రజెండా కింద ఏకం కావాలన్నారు. సిపిఐ గ్రామ కార్యదర్శి సహదేవ్, కాకం రాముడు, కట్టెల బాలస్వామి, పరంధాములు, తదితరులు పాల్గొన్నారు.
 
వెంగళాయిపల్లిలో ఘనంగా మేడే ఉత్సవాలు

వెంగలాయిపల్లి లో 138వ మేడే ఉత్సవాలను సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. బస్టాండ్ లో సిపిఐ గ్రామ కార్యదర్శి మల్లెపు బాలస్వామి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్, సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య మాట్లాడారు. మే డే కష్టజీవుల పండుగ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కష్టజీవులు జరుపుకుంటున్నారన్నారు. ఎర్రజెండా ప్రపంచ కార్మికుల బతుకుల్లో వెలుగులు తెచ్చిందన్నారు. పోరాటాల ఫలితంగానే హక్కులు వచ్చాయని, మెరుగైన జీవితం కోసం కష్టజీవులు ఐక్యంగా పోరాడాలన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.