పులి గట్టుపై మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తుల ధర్న

పులి గట్టుపై మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్తుల ధర్న
  •  ఐదు గంటల పాటు హై టెన్షన్
  •  త్రవ్వకాలు నిలిపివేయడంతో ఆందోళన విరమణ

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమరవాకుల గ్రామ పరిధిలోని పులిగుట్టపై మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆదివారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సుమారు ఐదు గంటలకు పైగా ధర్నా చేసి అధికారులు ప్రజల మధ్య హై టెన్షన్ క్రియేట్ చేశారు. మైనింగ్ తవ్వకాలు నిలిపివేస్తేనే ఇక్కడి నుండి వెళ్తామని వందలాది గ్రామస్తులు గుట్టపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాసిల్దార్ ఎస్సై అక్కడికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మైనింగ్ త్రవ్వకాలు నిలిపివేసి ఇక్కడి నుండి జెసిబిలను టిప్పర్లను తరలిస్తే తప్ప తాము ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు బీస్మించుకొని కూర్చోవడంతో కాంట్రాక్టర్ తో చర్చించి గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్, సర్పంచ్ బుచ్చన్న, భరత్ భూషణ్,  బాల మనమ్మ,  నరేందర్ రెడ్డి, బీచ్పల్లి యాదవ్,  ఆకుల రాములు యాదవ్,  సురేంద్ర చారి  ప్రకాశ్ శెట్టి,  చంద్రశేఖర చారి, నగేష్, అశోక్,  నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.