మామిడి చెట్లు, డ్రిప్పు పైపులైన్ దగ్ధం

మామిడి చెట్లు, డ్రిప్పు పైపులైన్ దగ్ధం

ముద్ర,వీపనగండ్ల:- 20 మామిడి చెట్లు ను డ్రిప్పు పైపులైన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసినట్లు బాధితులు పోతుల గోపాల్ రెడ్డి పోతుల దామోదర్ రెడ్డిలు తెలిపారు. వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన రైతులు పోతుల గోపాల్ రెడ్డి, పోతుల దామోదర్ రెడ్డి లు సుమారు పది ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తున్నారు. ఎప్పట్లాగానే గురువారం సాయంకాలం వరకు పొలం వద్దనే ఉన్నామని, రాత్రికి ఇంటికి వచ్చి ఉదయాన్నే పొలం వద్దకు వెళ్లగా 20 మామిడి చెట్లు,డ్రిప్పు పైపులైన్,మరికొన్ని పివిసి పైపులు పూర్తిగా కాలిపోయాయని వాపోయారు. గుర్తుతెలియని  వ్యక్తులు రాత్రివేళ మామిడి తోటలో చెత్తను అంటించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి మామిడి చెట్లు,డ్రిప్పు పైపులైన్, పివిసి పైపులు దగ్ధమయ్యాయి అని  తెలిపారు. ఘటనపై స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.