భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగాతనను ప్రజలు ఆశీర్వదించాలి

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగాతనను ప్రజలు ఆశీర్వదించాలి
  • అటు దేశం ఇటు రాష్ట్రం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలి
  • ఖాళీ బిందెలు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి లంకె బిందెలు కావాలంటే బిజెపికి ఓటేయండి
  • తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
  • తుంగతుర్తి లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు నెలకొల్పడానికి కృషి చేస్తా
  • తుంగతుర్తి మండలం లోని రుద్రమ చెరువును రిజర్వాయర్ గా మారుస్త
  • భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

తుంగతుర్తి ముద్ర:- ఖాళీ బిందెలు కావాలంటే కాంగ్రెస్ కు, లంకె బిందెలు కావాలంటే బీజేపీ కి ఓటేయాలన భువనగిరి పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గ్రామం చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖాళీ బిందెలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, లంకె బిందెలు కావాలంటే బిజెపికి ఓటెయ్యాలని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొంది మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని, బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో  నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి ,అక్రమాలకు దూరంగా మచ్చలేని ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. దేశం మొత్తం మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటునారని అన్నారు. సామాజిక ,సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో గత నాలుగు ఐదు దశాబ్దాలుగా జరిగినటువంటి పనులను కేవలం 10 సంవత్సరాల్లో చేసి చూపిన ఘనత  నరేంద్ర మోడీది అని అన్నారు. దేశంలో డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చిన ఘనత మోడీకే దక్కింది అని అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో భారతదేశాన్ని 11వ స్థానం నుంచి ఐదవ స్థానానికి పెంచారని అన్నారు.  

 

5000 కిలోమీటర్ల జాతీయ రహదారులనుబిజెపి ప్రభుత్వం వచ్చిన నిర్మాణం నిర్మించామని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్రధనస్సు కార్యక్రమం క్రింద ప్రతి టీకాను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 80 లక్షల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేవుడు అయితే,60 రూపాయలకు కిలో బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న మోడీ మహాదేవుడవు అని అన్నారు. రాష్ట్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి . వనాలకు, రైతు వేదికలకు. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకతో కాంగ్రెస్ కు ఓటేశారని అని  , అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి రావాలంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేయాలని కోరారు ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గం నుండి మోడీ సారధ్యంలో నిర్మాణమైన రెండు జాతీయ రహదారులు వెళుతున్నాయని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వేసిన సీసీ రోడ్డు మోడీ ప్రధానిగా మంజూరు చేసినవి అని అన్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభివృద్ధిని చేయలేదని కొంతమేర అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం సంకినేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గా ఉన్న రోజుల్లోనే అని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలిస్తే ప్రధాని మోడీని ఒప్పించి తుంగతుర్తి నియోజక వర్గంలో ఇప్పటివరకు లేని పరిశ్రమలను తీసుకువస్తానని అలాగే రుద్రమ చెరువును రిజర్వాయర్ గా మార్చడానికి కృషి చేస్తానని విద్యా విషయంలో ఉన్నత విద్య కేంద్రాలను నెలకొల్పుతానని అన్నారు పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని మరోసారి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు. అనంతరం తుంగతుర్తి పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారుస్థానిక పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్రావు  జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబ మండల పార్టీ అధ్యక్షుడు గాజుల మహేందర్ ఉప్పుల లింగయ్య , బిజెపి నాయకులు మేనేని వేణు ప్రకాష్ రావు మేనేని మాధవరావు కాప రవికుమార్   పులి పంపుల సైదులు మేనేని పాపారావు గుండ గాని అంజయ్య లతోపాటు పలువురు నాయకులు  కార్యకర్తలు  పాల్గొన్నారు.