అయోమయంలో సెకండ్ కే 'డర్ '

అయోమయంలో సెకండ్ కే 'డర్ '
  • అన్ని పార్టీల్లోనూ అదే ఫీ  "వర్ '' లీడర్ నుండి నమ్ముకున్న క్యాడర్
  • ముంచుతారా- తేల్చుతారా...!

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీల్లో రాజకీయ సమీకరణలు క్షణక్షణం వేగంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయా పార్టీలో ఉన్న సెకండ్ కేడర్ అయోమయంలో ఉందని చెప్పవచ్చు. ఆయా రాజకీయ పార్టీలు ప్రధాన లీడర్లను నమ్ముకున్న క్యాడర్ మొత్తం కూడా ఒక రకమైన గజిబిజి గందరగోళం అనే ఫీవర్ తో తండ్లాడుతున్నాయి. ఇన్నాళ్లు తమ నాయకుని నమ్ముకుని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని సెకండ్ కేడర్ మొత్తం కూడా ఈసారి తమ నాయకుడు ఎక్కడ నుండి పోటీ చేస్తాడు ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడు టికెట్ వస్తుందో రాదో అనే మీ  మీ మాంస లో కొట్టుమిట్టాడుతున్నారు.

నాయకుని రాజకీయ భవితకు పునాది సెకండ్ క్యాడర్

ఎన్నికల్లో నాయకునికి తోడుగా ఉండి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించి నాయకుని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయడంలో సెకండ్ కేడర్ పాత్ర ప్రధానమైంది ప్రధాన పార్టీలైన బీ ఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి లతోపాటు కమ్యూనిస్టులు ఇతర పార్టీలలోని సెకండ్ కేడర్ విలువైనది. నాయకుడే కాకుండా సెకండ్  కేడర్ ఆయా నియోజకవర్గాల్లోని పట్టణ గ్రామీణ ప్రాంత ఓటర్లతో నిత్యం టచ్ లో ఉంటూ తమ తమ అధినాయకుని గురించి మంచిగా ప్రచారం చేస్తూ ఉంటారు సెకండ్ కేడర్ను ఒక విధంగా ప్రభావితం చేసే వర్గంగా చెప్పుకోవచ్చు ఏ పార్టీ ప్రధాన నాయకుడైన వారి సెకండ్ కేడర్ సామర్థ్యం బట్టి వారి రాజకీయ పునాది భవిష్యత్తు మంచిగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

అదును చూసి పదును పెట్టె ఆలోచనలో సెకండ్ కేడర్

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా నాయకుల వద్ద ఉన్న సెకండ్ కేడర్ లో కదలిక మొదలైంది ఇన్నాళ్లుగా పార్టీ నాయకుల కోసం ఎంతగానో శ్రమించినప్పటికీ అవకాశాలు రాని కొంతమంది  కేడర్ అధికార పార్టీకి చెందినవారు అలక పూనుతున్నట్లు సమాచారం ఇన్నాళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం శ్రమించినప్పటికీ పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులు రాని కేడర్ మొత్తం ఒకింత నిరాశ నిష్పలతో ఉన్నట్లు రాజకీయ వర్గాల  బోగట్ట. అధికార పార్టీలో ఉన్న సెకండ్ కేడర్ బాధలు కష్టాలు ఒక ఎత్తు అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోనే సెకండ్ కేడర్ కష్టాలు బాధలు మరో రకమైనవి. ఇ న్నేళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు తమ కుటుంబాలకు సంక్షేమం అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వలేదని అతను చూసి ఆలోచనలకు పదును బెట్టి తమ తమ నాయకులకు సరైన రీతిలో దెబ్బ కొట్టాలనే ఆలోచనతో సెకండ్ కేడర్ అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.పార్టీలు అధికారంలో లేనప్పటికీ వెన్నంటి పెట్టుకొని ఉండి ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో లీడర్ ను నమ్ముకొని ఉన్న కేడర్ ఈసారైనా తమ నాయకుడు గెలిస్తే తమకు ఆర్థికంగా హార్దికంగా మంచి పొజిషన్లో ఉంటామని ఒక రకమైన నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

టికెట్ తెచ్చుకోవడం ఒక ఎత్తు క్యాడర్ ని నిలుపుకోవడం మరొక ఎత్తు

రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యునిగా పోటీ చేయడానికి టికెట్లకు బాగా గిరాకీ ఉండటంతో టికెట్ రావడం నానా కష్టంగా మారింది. ఇందుకు గాను పార్టీల అధినాయకత్వాలు పలు సర్వేలు జరిపి టికెట్లు కేటాయిస్తుండటంతో టికెట్ తెచ్చుకోవడమే గగనంగా మారింది దీనికి తోడు తేడాను కూడా తమతోనే ఉంచుకొని తమ వైపు తిప్పుకొని తమ గెలుపు కోసం ఎన్నికల్లో కేడర్ను ఉపయోగించుకోవడం  ఆయా పార్టీ అభ్యర్థులకు ఒక సవాలుగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటినుండి కేడర్ను కాపాడుకోవడం ఆర్థికంగా తడిసి మోపెడు అవుతుండడంతో ఆయా పార్టీల నాయకులు బెంబేలెత్తుతున్నారు. టికెట్ తెచ్చుకోవడం కేడర్ను కాపాడుకోవడం ఆయా పార్టీల అభ్యర్థులకు కత్తి మీద సా ములా మారింది.

ఓటర్లతో టచ్ లో ఉండేది సెకండ్ కేడర్

ఆయా పార్టీలోని సెకండ్ కేడర్ ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు ఓటర్లతో నిత్యం టచ్ లో ఉంటారు జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచులు వార్డు సభ్యులు కౌన్సిలర్లు మాజీ సర్పంచులు ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు ఇతర కార్యవర్గం , మాజీ ప్రజా ప్రతినిధులు అంతా కూడా ఓటర్లతో నిత్యం టచ్ లో ఉంటుంటారు. వీరందరినీ కలుపుకొని ప్రధాన నాయకుడు ముందుకెళ్తుంటాడు అందుకే ఈసారి ప్రతి పార్టీలోనూ సెకండ్ కేడర్ కు గిరాకీ పెరిగింది.

నాయకుడితోపాటే ఉండాలా ఇతర పార్టీలోకి వెళ్లాలా

ఎన్నికలు సమీపిస్తుండడంతో అంతా జంపింగ్  

జపాన్గుల కాలం నడుస్తుంది. ఆయా పార్టీలో ప్రధాన నాయకుడు ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని గెలవాలని తలంపుతో అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతుండగా తాము నమ్ముకున్న నాయకుడు ఏ పార్టీలో ఉంటాడు ఏ పార్టీకి మారుతాడు అన్న విషయంలో సెకండ్ కేడర్ లో గుబులుగా ఉంది. ఇన్నాళ్లు ఉన్న పార్టీలోనే ఉండాల్నా లేదంటే తమ నాయకుడు వెంట ఇతర పార్టీకి వెళ్లాల్నా అనే సందిగ్ధ స్థితిలో సెకండ్ క్యాడర్ ఉందని చెప్పవచ్చు. దీంతో తాను పార్టీ మారితే సెకండ్  కేడర్ కూడా తమతో పాటు పార్టీ మారతారా తన వెంట రాకుండా అదే పార్టీలో ఉంటారా అన్న తర్జనభజనలు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న నాయకుల్లో నెలకొని ఉన్నాయి. ఇంకొన్ని నెలలు గడిస్తే గాని ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు సెకండ్ కేడర్ల మార్పులు చేర్పుల విషయమై స్పష్టత రానుంది.