ప్రజా అర్జీలపై సత్వరమే స్పందించాలి.

ప్రజా అర్జీలపై సత్వరమే స్పందించాలి.
  • జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ప్రజావాణి అర్జీలను జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ లో  మొదటి రోజున  అదనపు కలెక్టర్లు సి.హెచ్ ప్రియాంక, వెంకట్ రెడ్డి లతో కలసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చే సూర్యాపేటలో నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, డి.పి.ఓ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించుకున్నామని సూర్యాపేట జిల్లా దినదినాభివృద్ది చెందుతున్నందున ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్ లో  శాఖలను కేటాయించిన వారీగా వీలైనంత త్వరగా కార్యాలయాలను సత్వరమే మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అర్జీదారులు ఎక్కువగా వివిధ భూసమస్యలపై అర్జీలు ఆ దించారని అట్టి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు 32, ఇతర శాఖలకు సంబంధించి 6 మొత్తం  38 దరఖాస్తులు అందాయని ఈ సందర్బంగా తెలిపారు. ముందుగా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం జరుపుకున్న సందర్బంగా కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్  కు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్.పి  సి.ఈ.ఓ సురేష్, పి.డి. కిరణ్ కుమార్, సి.పి.ఓ వెంకటేశ్వర్లు, డి.ఏ.ఓ రామారావు నాయక్, డి.హెచ్.ఓ శ్రీధర్ గౌడ్, డి.ఈ. ఓ అశోక్, dmho dr. హర్ష వర్ధన్,సంక్షేమ అధికారులు జ్యోతి పద్మ,  అనసూర్య, శంకర్, అధికారులు, సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.