రైతులకు మొదటిసారిగా ఉచిత విద్యుత్ అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది

రైతులకు మొదటిసారిగా ఉచిత విద్యుత్ అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది

ముద్ర.వీపనగండ్ల: రైతులకు మొదటిసారిగా ఉచిత విద్యుత్తును అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దేనని మాజీమంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం చిన్నంబావి మండల పరిధిలోని చిన్నదగడ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు..తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సారి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు.చిన్నంబావినీ ఎవరు అడగకపోయినా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు మండల కేంద్రంగా చేశానని,దాని తర్వాత వ్యాపారపరంగా,అభివృద్ది పరంగా చుట్టూ పక్కల గ్రామాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాయని, ఆనాడు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జలయజ్ఞం లో భాగంగా గ్రామాలలో పంట పొలాలకు సాగునీరు ఇవ్వడానికి కాలువల నిర్మాణం చేపట్టామని, అందువల్లే  ప్రతి గ్రామానికి సాగునీరు అందించే మార్గం ఏర్పడిందని అన్నారు.

ఎమ్మెల్యే బీరం కు ముందు చూపు లేక చేసిన నిర్లక్ష్యంతో రైతుల పంటలు అన్ని  ఎండిపోతున్నాయని,ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ఎమ్మెల్యే అమ్ముడుపోయిన సొమ్ముతో నాయకులను కొనుగోలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సంక్షేమ రాజ్యం సాధించుకోవాలని గ్రామంలోని మహిళలను,ప్రజలను జూపల్లి  కోరారు. కార్యక్రమంలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పిటిసి కృష్ణ ప్రసాద్ యాదవ్, ఎంపీటీసీ మౌలాలి, నాయకులు చిదంబ రెడ్డి, నాగరాజు,గంగాధర్,తేజ రెడ్డి తదితరులు ఉన్నారు.