తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ పిడమర్తి రవి కి టికెట్ ఇవ్వాలని కోరుతూ తుంగతుర్తిలో ర్యాలీ

తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ పిడమర్తి రవి కి టికెట్ ఇవ్వాలని కోరుతూ తుంగతుర్తిలో ర్యాలీ

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ ఉద్యమంలో నాడు విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి 182 కు పైగా కేసులు నమోదు అయ్యి జైలు జీవితం గడిపి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ పిడమర్తి రవికి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ కేటాయించాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగాఉస్మానియా విద్యార్థి నాయకుడు మిట్ట గడుపుల  రమేష్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన నాయకుడు పిడమర్తి రవి అని అన్నారు. రాష్ట్ర బహుజన గొంతుకగా ఎన్నో సమస్యలపై స్పందించి బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి రాష్ట్రానికి ఎనలేని సేవ చేసిన నాయకుడిగా పిడమర్తి రవి అన్నారు ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు తుంగతుర్తి నియోజకవర్గంలో 60 వేలకు పైగా ఉన్నాయని అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు పిడమర్తి రవికి టికెట్ కేటాయించినట్లయితే తొమ్మిదో దృష్టిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాయని త్వరితగతిన అభ్యర్థిని ప్రకటించినట్లయితే అధికార పార్టీని ఓడించడం సునాయాసంగా ఉంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని  పిడమర్తి రవికి టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో  పేరాల ప్రవీణ్ తడకమళ్ళ వెంకన్న చింతకుంట్ల వెంకన్న సైదులు ఇమ్మడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు