మే 8న నిరుద్యోగ నిరసన జంగ్ సైరన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

మే 8న నిరుద్యోగ నిరసన జంగ్ సైరన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి

పిసిసి ఉపాధ్యక్షుడు పోట్ల నాగేశ్వరరావు.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట : ఈనెల 8న నల్లగొండలో నిర్వహించే నిరుద్యోగ జంగ్ సైరన్ బహిరంగ సభకు సూర్యాపేట నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిసిసి ఉపాధ్యక్షుడు పొట్ల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్  అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ, పిసిసి ఉపాధ్యక్షుడు పోట్ల నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణకు తొలిసారిగా వస్తున్న ప్రియాంక గాంధీ  పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కోరారు.

తెలంగాణలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై జరిగే నిరుద్యోగ నిరసన భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ తెలంగాణలో ఉద్యోగుల ఇబ్బందులు, ఆత్మహత్యలు,పేపర్ లీకేజ్ నిరుద్యోగులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అంశాలపై ప్రసంగిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ  వరంగల్ డిక్లరేషన్ తరహాలోనే యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందేర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, ధారవత్ వీరన్న నాయక్, కందాల వెంకట్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఖమృద్దిన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలు గౌడ్,జిల్లా కార్యదర్శులు రుద్రంగి రవి,నాగుల వాసు, అక్కేనపల్లి జానయ్య, పిడమర్తి మల్లయ్య, జిల్లా అధికార ప్రతినిధి కుందామల్ల శేఖర్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, జిల్లా సేవా దళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో- ఆర్డినేటర్ యలగందుల సాయినేత,జవహర్ బాలమంచ్ కో ఆర్డినేటర్ భూక్యా శివ నాయక్,రెడ్ హౌస్ ఇంచార్జ్ నరేందర్ నాయుడు, జిల్లా నాయకులు పందిరి వెంకన్న,చెరుకు రాము, జమండ్ల సత్యనారాయణ, శిగ శ్రీను, ఉబ్బని రఘుపతి, యమగాని బిక్షం, ఖమ్మంపాటి మధు,పసుల అశోక్ యాదవ్,కోడి కుమార్ యాదవ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు..