సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు  చెవిటి వెంకన్న యాదవ్ అరెస్ట్ అనంతరం విడుదల

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు  చెవిటి వెంకన్న యాదవ్ అరెస్ట్ అనంతరం విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దశాబ్ది ఉత్సవాల నిరసన దినోత్సవ సందర్భంగా కేసీఆర్ దిష్టి బొమ్మను అన్ని జిల్లా కేంద్రాల్లో దగ్ధం చేసే కార్యక్రమంలో పాల్గొనకుండా సూర్యాపేట  డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ను ఆయన స్వగ్రామం గుమ్మడవెల్లిలో మద్దిరాల ఎస్సై తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొంతసేపటి తర్వాత విడుదల చేశారు.

నిరసన తెలిపే వారిని అరెస్టు చేయడం  హేయమైన చర్య.

రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుందని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సూర్యాపేటలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల నిరసన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా తనను తన ఇంట్లోనే అరెస్ట్ చేశారని ఇది హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.