రాజపేట గ్రామంలో గడపగడపకు అయోధ్య రామ మందిరం అక్షింతలు

రాజపేట గ్రామంలో గడపగడపకు అయోధ్య రామ మందిరం అక్షింతలు

ముద్ర.వనపర్తి:- మండలంలోని రాజపేట గ్రామంలోని రాజరాజేశ్వర అమ్మవారి ఆలయంలో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతల ను విశ్వహిందూ పరిషత్ వనపర్తి జిల్లా అధ్వర్యంలో  పూజలు నిర్వహించి గడపగడపకు పంచారు.జనవరి 22వ తేదీన ఆయోధ్యలో రామ మందిరం లో ప్రాణ ప్రతిష్ట ఉంటుందని, ఆరోజు దేశంలోని ప్రతి ఒక్కరు దగ్గర్లోని ఏదైనా గుడిలో వెళ్లి పూజలు నిర్వహించాలని ప్రజలకు వివరించారు.శతాబ్దాల కళ అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం ఈరోజుతో నెరవేరిందని విశ్వహిందూ పరిషత్ సభ్యులు ప్రజలలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.