అల్లోజి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణము...

అల్లోజి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణము...
  • కాంగ్రెస్ పార్టీ నాగం శశిధర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : కుమ్మెర గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అల్లోజి కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ...అల్లోజి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణలో భూమి కోల్పోయిన అల్లోజికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదన్న శశిధర్ రెడ్డి... ఉన్న వ్యవసాయ భూమిని కోల్పోయి ఉపాధి లేక అప్పులపాలై అల్లోజి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. పాలమూరు రంగారెడ్డి భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం - అందరూ ఆశ్చర్యపోయే రీతిలో నష్టపరిహారం అందిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ హామీని విస్మరించి రైతు ఆత్మహత్యలకు పరోక్ష కారణం అయ్యాడని దుయ్యబట్టారు.

భూనిర్వాసితులకు నష్టపరిహారంపై స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని..కేసీఆర్ , మర్రి జనార్ధన్ రెడ్డిలు కలిసి ఎంతమంది రైతుల ప్రాణాలను బలిగొంటారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. అల్లోజి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని.. బాధిత కుటుంబానికి  ఒకరికి  కోటి రూపాయలు చెప్పున ఎక్స్ గ్రేషియా   తక్షణమే 25 లక్షలు ఇవ్వాలి మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ  డిమాండ్ చేసింది వారితో పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నాగర్ కర్నూల్ మున్సిపాలి అధ్యక్షుడు తిమ్మాజీపేట పాండు, నాగర్ కర్నూల్ మండల పార్టీ అధ్యక్షుడు  కోటయ్య, తాడూరు మండల పార్టీ అధ్యక్షుడు ఇతోల్ లక్ష్మయ్య, తెలకపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్ రావు,  కౌన్సిలర్ ఎండీ నిజాముద్దీన్ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.....