రాష్ట్రములో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా ..? బీఎస్పీ 

రాష్ట్రములో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా ..? బీఎస్పీ 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ)జిల్లా ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఎస్పీ అసెంబ్లీ ఇంఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట, ఇ రోజు బహిరంగ మార్కెట్లలో ఉన్న కొనలేని పరిస్థితికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దిగజారడం బాధాకరం అన్నారు. యాసంగి పంట చేతికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్న, ఒక్క ఎఫ్సిఐ సెంటర్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అకాల వర్షాల వల్ల రైతులు అరిగోస పడి, ధాన్యాన్ని ఎంతో జాగ్రత్తగా బహిరంగ మార్కెట్ కు తీసుకుని వస్తే ఇటు ప్రభుత్వం - అటు మిల్లర్లు కొనక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న నాగర్ కర్నూల్ లో పర్యటించిన మంత్రులు ఒక్క ఐకేపీ సెంటర్ ను ఎందుకు సందర్సించలేదని అడిగారు. నేడు జరుగుతున్న బిఆర్ఎస్ఎల్పీ మీటింగ్ లో రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం, మిల్లర్లు ప్రభుత్వ మద్ధతు ధరకు కొనేల ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి సొంత ఫామ్ హౌస్ లపై శ్రద్ద తగ్గించి, రైతు సమస్యలపై దృష్టి పెడితే బావుంటుందని సూచించారు.

ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అసెంబ్లీ అధ్యక్షులు కారంగి బ్రహ్మయ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ అధికారం లోకి వస్తే , కౌలు రైతుల కోసం 5వేల కోట్లబడ్జెట్ ను ప్రవేశ పెడతామని బిఎస్పీ సీఎం అభ్యర్థి డా.ఆర్ఎస్పీ ప్రకటించినట్టు తెలిపారు. యాసంగి పంటలో పండించిన పత్రి గింజను కొంటానన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు, రాష్ట్రములో రైతుల ఆవేదనలు కనిపిస్తాలేవా అనీ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటే, బిఎస్పీ పార్టీ చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హామీలు నీటి మూటలు అయ్యయ్యని ఎద్దేవ చేశారు. రైతులకు సీఎం ఇచ్చిన హామీలు నేరవేరక పోతే, వ్యవసాయ శాఖ మంత్రి ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఇ కార్యక్రమంలో అచ్చంపేట్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ అధ్యక్షులు మోత్కూరి నాగార్జున, పృథ్వీరాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు