మణిపూర్ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి

మణిపూర్ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి

బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్.

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో ఎంపిడిఓ ఆఫీస్ నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు, ప్రభుత్వ హాస్పిటల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ భారత్ మాతా కీ జై అనీ నినదించే బీజేపీ పార్టీ - ఇ దేశ భారత మాతాలను ఎందుకు నగ్నంగా ఊరేగిస్తూన్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశ సైనికుల కుటుంబాలకు రక్షణ లేకపోతే, సామాన్య ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏం కాపాడుతుందని అడిగారు. మణిపూర్ రాష్ట్రములో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండి ప్రజలపై జరుగుతున్న అల్లర్లను అరికట్ట లేకపోవడం శోచనీయం అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టలేని బీజేపీ బేటీ బచావో బేటీ పడావో నినాదం ఇవ్వడంలో అర్థం లేదని విమర్శించారు.

హిందూవుల పాలనలో - హిందువులకే రక్షణ కరువందని ఎద్దేవా చేశారు. దేశానికి మాయావతి ప్రధాని, రాష్ట్రానికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి ఐతేనే మహిళలకు, ప్రజలకు రక్షణ ఉంటుందని తెలిపారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ మహిళ నాయకురాలు సృజన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలపై దాడులు వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, కోశాధికారి ఆనంద్, బిఎస్పీ నాయకులు మడుపు నాగేష్ డిప్యూటీ సర్పంచ్, ఆర్.శివ శంకర్, బాలనాగులు, ఇమామ్, రావణ్, రాజు, మధు, అంజి, కృష్ణ, నాగరాజు, విష్ణు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు డి.రాముడు, గుడిపల్లి శ్రీకాంత్, రామకృష్ణలు పాల్గొన్నారు.