కేటీఆర్ జన్మదిన సందర్బంగా ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

కేటీఆర్ జన్మదిన సందర్బంగా ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

ముద్ర, మొగుళ్లపల్లి: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్బంగా మండల కేంద్రంలోని స్థానిక అమ్మ గార్డెన్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం జిఎంఆర్ఎం  ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని యువతి  యువకులకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ తరగతులు మరియు అర్హులకు డ్రైవింగ్ లైసెన్స్ లు అందించే కార్యక్రమం ప్రారంభించగా మండలం నుంచి దాదాపు 2వేల పై చిలుకు అప్లికేషన్లు నమోదైనవి అని వారు తెలిపారు.

అనంతరం యువకులందరికి భోజన సదుపాయం ఏర్పాటు చేయగా గండ్ర దంపతులు స్వయంగా యువకులకు భోజనం వడ్డీంచారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జిఎంఆర్ఎం  ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి, జడ్పిటిసి జోరుక సదయ్య, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, ఎంపీపీ యారా సుజాత సంజీవరెడ్డి, పిఎసిఎస్  చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, సర్పంచులు, ఎంపీటీసీలు  బి ఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు