కారు గుర్తుకు ఓటేయాలి.. అభివృద్ధి కొనసాగాలి..

కారు గుర్తుకు ఓటేయాలి.. అభివృద్ధి కొనసాగాలి..
  • ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్సీ సారయ్య..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు  ఓటేయాలని, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21వ 22 వ వార్డుల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లలో తెలంగాణాలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టిందన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని వారు అన్నారు.

ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పరిశీలన..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో శుక్రవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి,మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పరిశీలించారు. అనంతరం భాస్కర్ గడ్డలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం గం.4.00 లకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి హాజరై ప్రసంగించనున్నారని, ఈ బహిరంగ సభకు సుమారు ఒక లక్ష జనాభాతో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.