జనశిక్షణ సహకారంతో టైలర్ శిక్షణ 

జనశిక్షణ సహకారంతో టైలర్ శిక్షణ 

శాయంపేట, ముద్ర : గట్లకానిపర్తి గ్రామంలో ప్రజ్వాల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్  మహిళా సాధికారథలో భాగంగా గట్లకానిపర్తి గ్రామంలో ఫీల్డ్ ఫెసిలిటేటర్ కల్పన (20) మంది మహిళలకు జనశిక్షణ సంస్థాన్ సహకారంతో 3నెలలు టైలరింగ్ నేర్పించి, సర్టిఫికెట్స్ అందజేయునున్నారు.  ఈ సందర్బంగా నవయుగ సొసైటీ అధ్యక్షులు కోసరి గోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని టైలరింగ్ ట్రైనింగ్  సెంటర్ ఓపెన్ చేయటం జరిగింది.  మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, స్వయంకృషితో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అని అన్నారు. అదేవిదంగా ఆధ్యాత్మికంగా, సామాజికంగా బలోపేతం అయి సమాజంలో ఆదర్శంగా నిలువాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో జనశిక్షణ సంస్థాన్ అధికారులు, ప్రజ్వాల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్ ప్రియంక రెడ్డి,  ఉపసర్పంచ్ బోడకుంటి సురేందర్ , బీసీఐ రైతు పెద్దిరెడ్డి దేవేందర్ రెడ్డి ,ఫీల్డ్ ఫెసిలిటేటర్స్ హిమబిందు, సునీల్, తిరుపతి,గౌస్, ప్రశాంత్, ట్రైనర్ మమత, మహిళలు పాల్గొన్నారు.