కాంగ్రెస్ గతం బీఆర్ఎస్ భవిష్యత్తు

కాంగ్రెస్ గతం బీఆర్ఎస్ భవిష్యత్తు
  • ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హుజూర్ నగర్ ముద్ర:కాంగ్రెస్ పార్టీ గతమని బీఆర్ఎస్ తెలంగాణ భవిష్యత్తు అని తెలంగాణ రాష్ట్రంలో ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్ రావాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా హుజూర్ నగర్ చేరుకున్న కేటీఆర్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి ఇందిరా సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వర్షం కారణంగా కేటీఆర్ రోడ్ షో ఆలస్యం అయింది. ప్రజలు వర్షంలో తడుస్తూ కేటీఆర్ మాటలను ఆసక్తిగా వినడం విశేషం.

కేటీఆర్ రోడ్ షో కామెంట్స్:

-ముసలి నక్క లాంటి కాంగ్రెస్ పార్టీ మనకొద్దు.యువ నాయకుడు సైదిరెడ్డిని గెలిపించుకుందాం.
-ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట తప్పి ఉత్తమ్, కోమటిరెడ్డి, మైనంపల్లి కుటుంబాలలో ఇద్దరికీ టికెట్ ఇచ్చింది. ఇచ్చిన మాట మీద నిలబడలేని వాళ్లు ఆరు గ్యారెంటీలను ఏం అమలు పరుస్తారు.
-ఉత్తమ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువగా సైదిరెడ్డి ఈ నాలుగేళ్లలో చేసి చూపించాడు.
-ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కుంభకోణం జరిగింది. స్కాములు చేయడం రాష్ట్రాన్ని మింగడం ఇదే కాంగ్రెస్ నినాదం.
- ఎలక్షన్లు రాగానే కన్ఫ్యూజ్ అయ్యి ఆగమాగం కావద్దు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
-రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని అంటాడు ఉత్తంకుమార్ రెడ్డి కెసిఆర్ రైతుబంధు ఇచ్చి డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడు అని అంటాడు.
 - రాహుల్ గాంధీ కి పబ్బులు ,క్లబ్బులు, విందులు ,చిందులు తప్ప రైతుల బాధలు, వ్యవసాయం గురించి తెలియదు.
- రాహుల్ గాంధీని ఇండియా అంతా పప్పు అని పిలుస్తారు ఆ పప్పు రాహుల్ గాంధీ బెంగాల్ లో మమతా బెనర్జీని ఢిల్లీలో కేజ్రీవాల్ నీ తెలంగాణలో కేసీఆర్ నీ బిజెపి బీ టీం అనడం అవివేకం.
- అభివృద్దే కేసీఆర్ కులం సంక్షేమమే కేసీఆర్ మతం.
- ఈనెల 30వ తారీకు నాడు మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి హుజూర్ నగర్ లో సైదిరెడ్డిని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలి

ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, గట్టు శ్రీకాంత్ రెడ్డి, జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.