పరిశ్రమల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వ కృషి 

పరిశ్రమల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వ కృషి 

జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ది కొరకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు అన్నారు.  తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట పరిధిలోని సువెన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో పరిశ్రమల శాఖ జి‌ఎం తిరుపతయ్య అద్యక్షతన నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యాక్రమంలో జిల్లా కలెక్టర్  యస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.  తెలంగాణ ఆవిర్భావం అనంతరం పరిశ్రమలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు.  ప్రపంచంలో అన్ని  రంగాల్లో  తెలంగాణ పోటీ పడుతుందన్నారు.  టీఎస్ ఐ పాస్ ద్వారా పారిశ్రామిక ప్రగతి పురోగతి సాధిస్తుందని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమలకు అధునాతన మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు.  టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో ఏర్పాటు చేసి నెల రోజుల లోపే పరిశ్రమలకు  అనుమతులు జారీ చేస్తుందని తెలిపారు.  తెలంగాణలో మీసేవాల ద్వారా అనేక మార్పులకు చోటు చేసుకుందని,  మీసేవా ద్వారా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలను 96శాతం ధరణిలో పరిష్కరించబడిందని పేర్కొన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసిల ద్వారా యువతకు అనేక ఉపాధి కల్పన కల్పిస్తుందని అన్నారు. అనంతరం వివిద రంగాల పారిశ్రామిక వేత్తలను సన్మానించారు. ఈ కార్యాక్రమంలో ఈడిపి ఎం గఫార్, సుధాకర్ పి‌వి‌సి ఛైర్మన్ మీలా మహదేవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షుడు సోమనర్సయ్య, మీసేవ జిల్లా అద్యక్షుడు శ్రీకాంత్, సువెన్   ఫార్మా వైస్ ప్రెసిడెంట్ కే‌వి శేషగిరి రావు, ‌టిజే రాయుడు, వెంకట్ రెడ్డి, టి.సైదులు తదితరులు పాల్గొన్నారు.