18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలి
  • ఓటర్ అవగాహన కార్యక్రమంలో జెండా  ఊపి ర్యాలీ ప్రారంభించిన  ఎంపీడీవో ఈదయ, తాసిల్దార్ వి సరిత, సర్పంచ్ కొడారు వెంకటేశ్వర్లు

చిలుకూరు ముద్ర : చిలుకూరు మండల కేంద్రంలోని, శనివారం,ఓటర్ అవగాహన కార్యక్రమం పై, జడ్పీహెచ్ఎస్  హై  స్కూల్ విద్యార్థులచే 5 కే రన్, కార్యక్రమాన్ని చేపట్టారు,ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ప్రతి ఒక్కరు, ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందాలని, ప్రతి ఒక్క మనిషికి రాజ్యాంగం మనకు ఇచ్చిన, ఓటు హక్కు,  ఒక ఆయుధమని  ఓటుని అమ్ముకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా, ఓటుని పారదర్శకంగా సద్వినియోగం చేసుకోవాలని, ఓటు యొక్క విలువ గురించి, ప్రజల్లో అవగాహన కల్పించుట కొరకు,తెలంగాణ రాష్ట్ర ఎన్నికల, కమిషన్ ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందని, ఎంపీడీవో ఈదయ్య  అన్నారు, ఈ కార్యక్రమంలో, పంచాయతీ కార్యదర్శి షేక్ షరీఫుద్దీన్, పంచాయతీ బిల్ కలెక్టర్, ధర్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కరుణాకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, పి ఈ టి, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.