చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు మృతి..

చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు మృతి..
  • గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో గాయాలు..
    పోలీసుల అదుపులో నిందితులు..?

మెట్‌పల్లి ముద్ర:- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు రజాక్ మృతి చెందాడు. దివంగత నేత మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ముఖ్య అనుచరుడుగా ఉంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన రజాక్ గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తీవ్ర గాయాల పాలై నిజామాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.కాగా రజాక్ పై దాడి చేసిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.