రాష్ట్ర మంత్రి వర్గంలో మాదిగలకు స్థానం కల్పించడంలో ముఖ్యమంత్రి విఫలం

రాష్ట్ర మంత్రి వర్గంలో మాదిగలకు స్థానం కల్పించడంలో ముఖ్యమంత్రి విఫలం
  • మాదిగలను అణగ తొక్కుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్
  • తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామెల్ కు మాదిగ సామాజిక వర్గం అండగా నిలుస్తుంది    -మందకృష్ణ మాదిగ
  • తుంగతుర్తి లో మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ ఆత్మీయ సమ్మేళనం
  • మందుల సామెల్ ఆత్మీయ సమ్మేళనానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

తుంగతుర్తి,  ముద్ర:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు తెలంగాణ ఉద్యమంలో తనను రక్షించిన మాదిగలను నేడు తన ప్రభుత్వంలో అణగ తొక్కుతున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు .శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో  ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూకెసిఆర్ ప్రభుత్వంలో మాదిగలకు అన్యాయం జరిగిందన్నడానికిమంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించకపోవడమేనని అన్నారు. .11 నుండి 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదని ఒక స్థానం ఉన్న వెలమలకు నలుగురు మంత్రులనిఒకటి రెండు శాతం ఉన్నరెడ్లకు 6గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారని ఇది మాదిగ సామాజిక వర్గాన్ని అవమానించడం కాదా అని అన్నారు తెలంగాణ ఉద్యమంలోకళాకారుల పాత్ర పోషించింది మాదిగ బిడ్డ లేనని తెలంగాణ ఉద్యమం ముందుకు సాగడానికి కళాకారుల ధూంధాం కార్యక్రమాలే ప్రధానమని అన్నారు .ఉద్యమంలో అమరులైన అమర వీరుల్లో అధిక శాతం మాదిగ సామాజిక వర్గం వారని అన్నారు . కెసిఆర్ ప్రభుత్వంలో అడుగడుగునా మాదిగల అన్యాయమే జరుగుతుందని మాదిగ బిడ్డలంతా ఏకమైముఖ్యమంత్రికి వారి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు . తుంగతుర్తి నియోజకవర్గంలో 80% పైగా ఉన్న మాదిగ బిడ్డలకు స్థానికులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతరులకు కనీసం 15 శాతం లేని మాల సామాజిక వర్గం వారికి టికెట్ ఇవ్వడం ఏమిటి అది ప్రశ్నించారు. మొదటి సారి రెండవసారి టికెట్ ఇస్తారని ఆశించిన స్థానికుడు vi ఉద్యమ నాయకుడైన మందుల సామెల్ మూడవ సారి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో సహనం నశించి పార్టీ నుండి బయటకు వచ్చారని అన్నారు .రానున్న ఎన్నికల్లో మాదిగ బిడ్డలంతా ఏకమై సామెల్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.

మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రారంభ కాలం నుండి రాజీనామా చేసేదాకా పార్టీ కోసం ప్రజల కోసం సేవ చేశారని అయినా తన సేవను గుర్తించకుండా గ్రామ గ్రామాల్లో తెలంగాణ జెండా గద్దెల నిర్మించిన తనను పక్కకు పెట్టి స్థానికేతరునికి టికెట్ ఇవ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంత మాత్రం తగదని అన్నారు. .62,000ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గాన్ని పక్కనపెట్టి కేవలం 15 వేల ఓట్లున్న స్థానికేతరునికి మాల సామాజిక వర్గం వారికి గత రెండుసార్లు టికెట్ ఇవ్వడమే కాకుండా మూడోసారిగా టికెట్ వారికి కేటాయించడం అత్యంత దారుణమని అన్నారు. తిరుమలగిరి సభలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ తుంగతుర్తి అభ్యర్థిని 40 వేల మెజార్టీతో గెలిపించాలని అన్నారని కానీ తమంత ఏకమై 40 వేల మెజార్టీతో ఓడిస్తామని అన్నారు .2023 ఎన్నికల్లో తాను పోటీ చేయడం తధ్యమని నియోజకవర్గ నుండి పోటీ చేస్తున్న తనకు మాదిగ సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారుతుంగతుర్తి నియోజకవర్గం లో అరాచక రాజకీయం కొనసాగుతుందని ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు .ప్రజాస్వామ్యవాదులు మేధావులు జరుగుతున్న గమనించి రానున్న ఎన్నికల్లో స్థానికేతరులకు గట్టిగా బుద్ధి చెప్పాలని సామెల్ కోరారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తారని తనతో కలిసి వచ్చే వారందరిని కలుపుకొని పోతానని అన్నారు.

సమావేశానికి ముందు తుంగతుర్తి మండల కేంద్రంలో మందుల సామిల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మేళనానికి కార్యకర్తలు నాయకులు భారీగా తరలిరావడంతో వందలసార్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓరుగంటి సత్యనారాయణ పుసపల్లి బిక్షం మల్లారెడ్డి సైదులు వెంకన్నలతో పాటు పలు మండలాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.