పాలపాటి గాంధీ  మరణం చాలా బాధాకరం..

పాలపాటి గాంధీ  మరణం చాలా బాధాకరం..
  • నా బాల్యమిత్రుడు గాంధీ మరణం వారి కుటుంబానికి తీరని లోటు
  • డా || మల్లెబోయిన అంజి యాదవ్

ముద్ర,అనంతగిరి: నా బాల్యమిత్రుడు 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న పాలపాటి గాంధీ  మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని డా,,మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రామపురం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన పాలపాటి గాంధీ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి దహన ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి తక్షణసాయంగా 5000 రూపాయలు అందించిన తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా,, అంజి యాదవ్.అనంతరం ఆయన మాట్లాడుతూ  నా బాల్యమిత్రుడు 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న గాంధీ మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని  కుటుంబంలో పెద్ద దిక్కున కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని గాంధీ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబం అని వారి కుటుంబాన్ని చిన్ననాటి మిత్రుడుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.అనంతరం వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి వారి కుటుంబానికి అండగా ఉంటానని అంజి యాదవ్ అన్నారు.వారి వెంట  తెలంగాణ బీసీ సంఘం నాయకులు కతిమాల వెంకన్న, తదితరులు ఉన్నారు.