క్రీడలతోనే మానసిక ఉల్లాసం - రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్

క్రీడలతోనే మానసిక ఉల్లాసం - రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
  • క్రీడలతోనే పోటీతత్వం
  • ఘనంగా సీఎం కప్ ప్రారంభం
  • జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న క్రీడాకారులు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:క్రీడాలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.  మట్టిలో ఉన్న మణిక్యాలను వెలికితీసి గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను  ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ తన పేరున కప్ ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీలలో జిల్లా వ్యాప్తంగా 23మండలల నుండి 91జట్లు, 1282మంది క్రీడాకారులు పాల్గొనగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్రీడా జ్యోతి వెలిగించి అధికారికంగా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలతోనే పోటీతత్వం క్రీడలతోనే ఏర్పడుతుందని, క్రీడాకారులు పట్టుదలతో క్రీడలలో పాల్గొని విజయం సాధించాలని తెలిపారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది పలుకుతుందని ఓటమితో కృంగిపోకుండా గెలుపు కొరకు క్రీడాకారులు కృషి చేయాలని పేర్కొన్నారు. క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలన్న ఉద్దేశ్యంతో మండల, జిల్లా స్థాయిలో క్రీడలను నిర్వహించి  బహుమతులు, ప్రోత్సహకాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక  క్రీడలను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా  1021 గురుకులలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి పై రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని వర్ణించారు. తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడొద్దని రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా ఏర్పడ్డాక అన్ని రంగలో అభివృద్ధి జరుగుతుందని, సూర్యాపేట జిల్లా ఏ కార్యాక్రమం చేపట్టిన ఆన్నింట్లో నెంబర్ వన్ గా నిలుస్తుందని ఆయన చెప్పారు. క్రీడాభివృద్ధికి  తన వంతుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

  • జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకరావాలి
  • జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు

జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకరావాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు సూచించారు. సీఎం కప్ ఏర్పాట్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సిబ్బందికి ఆయన అభినందించారు. 
జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను తలదాన్నెల ఏర్పాట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 
సుమారు రూ.13లక్షలను కేటాయించినట్లు వివరించారు.  
విద్య రంగాన్ని, క్రీడా రంగాన్ని సమానంగా మంత్రి జగదీశ్ రెడ్డి  అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యాక్రమంలో ఆడిషినల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పి సీఈఓ సురేష్ కుమార్ ,డీఎస్పీ నాగభూషణం, ఎంప్లాయిమెంట్స్ ఆఫీసర్ ఎస్ మాధవరెడ్డి ,సిపిఓ వెంకటేశ్వర్లు, dyso  వెంకట్ రెడ్డి, అగ్రికల్చరల్ అధికారి రామారావు నాయక్, బీసీ వెల్ఫేర్ అనసూయ, మిషన్ భగీరథ అధికారులు పాపారావు ,వెంకటేశ్వర్లు, డి ఈ ఓ అశోక్,dpro రమేష్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.