హస్తం గూటికి మాజీ? అయోమయంలో అనుచర వర్గం
- పార్టీలో చేరేందుకు భారీ నజరానా
- బిఆర్ఎస్ కు దిక్కు ఎవరు?
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారని మహబూబ్ నగర్ & మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయడం ఖాయమని రసవతరంగా చర్చ సాగుతుంది. ఇటీవల ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఆయన ముఖ్య అనుచరులతో పార్టీ మారడంపై చర్చించినట్లు తెలిసింది ఊహగానాలకు తెరపెట్టేందుకు పార్టీ వీడేది లేదని కెసిఆర్ తనకు దైవ సమానులని పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. అయినప్పటికీ బిజెపి మరియు కాంగ్రెస్ నేతలు తనను పార్టీ మారమని కోరుతున్నారని సంకేతం పరోక్షంగా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ ముందు ఆయన రెండు ప్రతిపాదనలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
మహబూబ్నగర్ లేదా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాలను కేటాయించాలని కోరినట్లు ఓటమి చెందిన.. రాజ్యసభ ద్వారా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దల ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది పార్టీలో చేరడానికి ముందు పార్టీకి కోట్లాది రూపాయలు నజరానా ముట్ట చెప్పేందుకు అంగీకారం కుదిరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పది రోజుల్లో ఆయన హస్తం గూటికి చేరనున్నారని తెలిసింది. గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగిన మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కొంత కృషి చేసిన ఓటమి చెందడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు అనుచరులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బి ఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు అయోమయంలో పడ్డారు తమ నాయకుడు వెంటే వెళ్లాలా లేదంటే ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి వెంట పార్టీలోనే కొనసాగాల అనే చర్చించుకుంటున్నట్లు సమాచారం...