మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను వెంటనే విడుదల చేయాలి...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను వెంటనే విడుదల చేయాలి...
  • నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య  డిమాండ్                                      

ముద్ర లింగాల :  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలని. ఆయనపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని తెలుగుదేశం పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య అన్నారు. మంగళవారం ఆయన  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కావాలని చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించారని. ప్రజాస్వామ్యబద్ధంగా పాలనను కొనసాగించి. స్కిల్స్  డెవలప్మెంట్ ద్వారా ఎందరో  నిరుద్యోగులకు ఐటి ఉద్యోగులుగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు. తన జీవనోపాధికి హెరిటేజ్ ద్వారా పాలు అమ్ముకున్నాడు గాని.  పరిపాలనను ఎప్పుడూ అమ్ముకోలేదన్నారు.  

వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా యావత్ ఉమ్మడి రాష్ట్రం నిరసన ప్రదర్శనలు చేస్తుందని అన్నారు.  చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి 24 రోజులైనా కూడా న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  గత నెల 9న రిమాండ్ చేసి ఆయనకు జైలుకు తరలించారు అన్నారు. జైలులోనే సత్యాగ్రహ నిరాహారదీక్ష చంద్రబాబు నాయుడు చేపట్టినట్లు ఆయన అన్నారు. నిరుద్యోగుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ.  వారికి ఉపాధి కల్పన ధ్యేయంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి  జైలు పాలు చేయడం సరికాదన్నారు.  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం కలిసి మాజీ ముఖ్యమంత్రిని ఇబ్బందులకు గురి చేయడం   పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.  మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వెంటనే విడుదల చేయాలని. లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.