కెసిఆర్ ప్రధాని అవుతానని అనుకోవడం పైశాచిక ఆనందం కాదా...?  

కెసిఆర్ ప్రధాని అవుతానని అనుకోవడం పైశాచిక ఆనందం కాదా...?  

MLA GBR సమాధానం చెప్పాలి - కొత్తపల్లి కుమార్ BSP
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) జిల్లా ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇ కార్యక్రమంలో BSP నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ బిఎస్పీ-ఆర్ఎస్పీ లను విమర్శించడం గువ్వల బాలరాజుకు తగదని హెచ్చరించారు. అలా మాట్లాడాల్సి వస్తే మాయావతి కాళ్ళు మొక్కిన కెసిఆర్ మాట్లాడాలని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 36మంది ఎంపీలతో మద్దత్తు ఇచ్చిన తొలి జాతీయ నాయకురాలు మాయావతి అనీ అన్నారు. అప్పుడేమో అవసరం కోసం కాళ్ళు పట్టుకుని, ఇప్పుడేమో చెంచాలతో అవాకులు చేవాకులు మాట్లాడిస్తే బహుజన సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వెళ్లి, అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే గువ్వల అనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి గువ్వల బిఎస్పీ పార్టీనీ బిజేపీకి బి-టీం అనడం దొందు దొందే అన్నారు. బిజేపీకి నిజమైన బి-టీం బిఆర్ఎస్ అనీ పేర్కొన్నారు.

మునుగోడు ఎన్నికల్లో బిఎస్పీకి వచ్చిన ఓట్లు ఎన్ని అడుగుతున్నా గువ్వల, 2004లో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులైన నిరంజన్ రెడ్డి, మెట్టుకాడి శ్రీనివాస్, నాగర్ దొడ్డి వెంకట్రాములు, లక్ష్మారెడ్డిలకు ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఎమ్మెల్యే జీబీర్ ఎన్ని డబ్బులు పంచాడో కూడా ప్రజలకు స్పష్టం చేయాలనీ కోరారు. బిఆర్ఎస్ అనీ పార్టీ పేరు మార్చి, కెసిఆర్ దేశ ప్రధాని కావాలనుకోవడం కూడా నూటికి నూరు శాతం పైశాచిక ఆనందమే అనీ కుమార్ అన్నారు. బిఎస్పీ - ఆర్ఎస్పీ పట్ల గువ్వల తన వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే అచ్చంపేట్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రామచంద్రం, అచ్చంపేట్ ఇంచార్జ్ కొయ్యల శ్రీనులు మాట్లాడారు. దేశి ఇటిక్యాల గ్రామవాసి చాకలి ఐలమ్మ వారసుడు బాజీపూర్ కృష్ణ పార్టీలో చేరారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు కళ్యాణ్, బిఎస్పీ నాయకులు బాలనాగులు, మధు, వెంకటయ్య, బి.రాజ్, బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణలు పాల్గొన్నారు.