రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించింది.. పంచాయతీ కార్యదర్శులు కాదు..

రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించింది.. పంచాయతీ కార్యదర్శులు కాదు..

ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు కానీ కార్యదర్శుల సమస్యలు పరిష్కారించరా : ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  మెరిట్ ప్రాతిపదికన నియామకం అయిన పంచాయతీ కార్యదర్శులను రెగ్యుల రైజ్ చేయకుండా.. ప్రభుత్వమే నిబంధనలు ఉల్లగించిందని... పంచాయతీ కార్యదర్శులు కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్లో పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కరోనా కాలంలో ప్రజలకు అండగా ఉంటూ, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి, వ్యాధుల కట్టడికి కృషిచేశారన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు హరిత హారం, పల్లె ప్రగతి, క్రీడా మైదానాలు, ఇంకుడు గుంతలు, తాగునీరు అందిస్తూ, గ్రామాలను అభివృద్ధి చేసి, జాతీయ స్థాయి అవార్డులు సాధించి పెట్టారని, మూడు సంవత్సరాల ఒప్పధం ముగిసి, మరో ఏడాది పొడిగించారని, అయినా క్రమబద్దికరణ చేయకుండా  పంచాయతీ కార్యదర్శులను వేధిస్తున్నారన్నారు.

ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సకల జనుల సమ్మె తో ప్రభుత్వం దిగివ చ్చిందని మరువరాదు అన్నారు. నేటి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా విధుల్లో నుండి తొలగిస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు.. మరి కార్యదర్శుల న్యాయమైన సమస్యలు పరిష్కారించరా అని ప్రశ్నించారు. మీకు అండగా ఉంటానని పంచాయతీ కార్యదర్శులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమం లో డీసీసీ అద్యక్షుడు  అడ్లురి లక్ష్మణ్ కుమార్, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, ఎంపిటిసి భుమారెడ్డి, గోపి రావు, కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుండా మధు పాల్గొన్నారు.