మెదక్ లో గ్రామీణ బ్యాంకర్స్ వాకతాన్

మెదక్ లో గ్రామీణ బ్యాంకర్స్ వాకతాన్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో బుధవారం గ్రామీణ వికాస్ బ్యాంక్ మెదక్, మెదక్ మార్కెట్ ఏరియా, మంబోజిపల్లి, శంకరంపేట, యూసుఫ్ పేట, పాపన్నపేట, వెల్లురి, లక్ష్మాపూర్ శాఖల ఆధ్వర్యంలో, సిద్దిపేట రీజియనల్ ఆఫీస్ బిజినెస్ మేనేజర్ రజాక్ పాషా, ధనరాజ్ ఆధ్వర్యంలో వాకతాన్ నిర్వహించారు. ఈ వాకతాన్ లో మెదక్ పట్టణ ప్రజలకు ఏపీజీవీబీ బ్యాంకు కలిగించే సదుపాయాల గూర్చి వివరించారు.

 ఇందులో భాగంగా ఏపీజివీబీ బ్యాంకు డిపాజిట్లపై అత్యధికంగా 8% వడ్డి రేటు కల్పిస్తుందని, హౌజింగ్ లోళ్ళపై 8.75 శాతం  వడ్డీపై రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. . అలాగే అన్ని శాఖలు పంటరుణాలు, బంగారంపై బుణాలు, బిజినెస్ కోసం, వ్యాపార రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు త్వరితగతిన మంజరు చేయడం జరుగుతుందన్నారు.  ఈ వాకతాన్ ప్రజలకు గవర్నమెంట్ ఇన్సురెన్స్ తదితర పథకాలపై అవగాహనకల్పించారు.