డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అనర్హులను తొలగించి అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోతే మండలం రావి పహాడ్ గ్రామానికి చెందిన పేదలు కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రావి పహాడ్ గ్రామపంచాయతీలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. అర్హులైన వారికి కాకుండా వ్యవసాయ భూములు ,ఇండ్ల స్థలాలు, ఆర్థికంగా ఉన్నవారికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు కేటాయించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలోకి తొక్కి అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లో అనహర్హులకు చోటు కల్పించారని ఆరోపించారు. 

వెంటనే అధికారులు గ్రామంలో పర్యటించి సమగ్ర విచారణ చేపట్టి అనహర్హులను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రావి పహాడ్ గ్రామ పేదలు వెలుగు మధు చేగువేరా, గోపగాని లక్ష్మయ్య, సండ్ర మధు, ఇట్టమల్ల మాణిక్యమ్మ ,కల్లెపెల్లి సుగుణమ్మ ,పెరుమళ్ళ నాగమణి, ఐతరజుజానమ్మ, గోపగని సతీష్, గొపగని లింగయ్య , మోత్కూరి వెంకటాచారి, అక్కిన పెళ్లి సోమాచారి, అక్కినపెల్లి సైద చారి, పొడ పంగి దుర్గమ్మ, పప్పుల సృజన, పొడపంగి అలివేల, పడిదల ఎల్లమ్మ, పిల్లుట్ల ఉప్పమ్మ, పగిళ్ల భద్రమ్మ, బుల్లెట్ ఎల్లమ్మ, దేవదానం,  కు చం గోపయ్య, బాపనపల్లి నాగయ్య, పొడపంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.