ఏషియన్ తిరుమల థియేటర్ యాజమాన్యం అత్యుత్సాహం..

ఏషియన్ తిరుమల థియేటర్ యాజమాన్యం అత్యుత్సాహం..
  • ఫ్యామిలీ టికెట్లు అడిగిన కస్టమర్ తో దురుసుగా ప్రవర్తించిన యాజమాన్యం..
  • ఇద్దరి మధ్య వాగ్వాదం..

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట ఏషియన్ తిరుమల థియేటర్ లో సినిమా టికెట్స్ కోసం వెళ్లిన కస్టమర్లతో యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో వివాదం చోటుచేసుకుంది.జిల్లా ప్రజలు నూతనంగా ఏర్పాటుచేసిన ఏషియన్ తిరుమల థియేటర్లో సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా కుటుంబ సభ్యులతో వస్తున్న కస్టమర్లకి దురాశ మిగులుతుంది. ఎంతో ఆశగా కుటుంబ సభ్యులతో సినిమా చూడాలని వస్తున్న కస్టమర్లకి వారు చెప్పే సమాధానం చికాకు తెప్పిస్తుంది.కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు ఆ థియేటర్ యాజమాన్యం దురుసుగా సమాధానం చెప్పడంతో తట్టుకోలేక కస్టమర్లు వాగ్వాదానికి దిగుతున్నారు.సినిమా చూద్దామని ఓ వ్యక్తి చాలా ఆశగా తన కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్ కు  విచ్చేశాడు.బుకింగ్ కౌంటర్లో ఉన్న మేనేజర్ ని త్రీసాయిని ఫ్యామిలీ టికెట్ అడిగాగా ఫ్యామిలీ టికెట్లు లేవని దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో కస్టమర్ ఫ్యామిలీ బాక్స్ టికెట్లు కావాలని కుటుంబ సభ్యులతో వచ్చానని వారికి పేర్కొన్నారు. దురుసుగా మేనేజర్ సమాధానం చెప్పడంతో అక్కడ ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలోనే సినిమా థియేటర్ కి చేరుకున్న ప్రేక్షకులు ఈ వాగ్వాదాన్ని చూసి కష్టమర్లు అంటే ఏషియన్ తిరుమల థియేటర్ యాజమాన్యానికి మర్యాద లేకపోవడం దురుసుగా ప్రవర్తించడం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికైనా జిల్లా ప్రజలకు అనుకూలంగా స్టాప్ ని ఎంపిక చేసి ప్రేక్షకులతో మర్యాదగా మాట్లాడాలని తిరుమల థియేటర్ యాజమాన్యాన్ని జిల్లా ప్రజలు కోరుతున్నారు..

  • జిల్లా ప్రజలకు అందుబాటులో లేని రేట్లు

సామాన్య ప్రజలు తిరుమల థియేటర్లో సినిమా చూడలేని పరిస్థితి టికెట్ రేట్ ఒక్కటి 250,సినిమా విరామం టైంలో కూల్డ్రింక్స్ త్రాగలంటే 60రూ.స్నాక్స్ తినాలంటే 100రూ. విపరీత మైన రేట్లతో ప్రేక్షకులు బెంబేలేత్తుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.