కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు  కకావికలం 

కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు  కకావికలం 
  • మూడోసారి వచ్చేది కేసీఆరే.... గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 
  • కేసిఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా కు సకలజనుల ఆమోదం
  • కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది ప్రజల భావన.
  • కేసీఆరే మూడోసారి సీఎం కావాలనేదే ప్రజల భావన
  • తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రతిపక్షం లేదు
  • ప్రతిపక్షాలవి చిల్లర ప్రగల్భాలు..వ్యాఖ్యలు అర్థరహితం.. అవగాహానరాహిత్యం 
  • 75 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీలే.
  • కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరు.
  • కాంగ్రెస్ మహా అంటే 50 స్థానాల్లో పోటీ చేస్తుందేమో.
  • బీజేపీ ఉన్న మూడు నిలబెట్టుకోవడానికి అపసోపాలు పడుతోంది.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు గెలిచి కేసీఆర్ చేతిలో పెడతాం.
  • కోతలు కోస్తున్న నేతలు కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేసే దమ్ముందా.
  • కేసీఆర్ లా ఓడిపోకుండా గెలిచిన‌ మొగోడు కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్నారా.
  • ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్  టీమ్  నంబర్ వన్
  • వచ్చే ఎన్నికల కప్ ను గెలుచుకుని కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తాం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అభ్యర్థుల  ప్రకటన ను క్యాష్ చేసుకోవాలని ఆశపడిన ప్రతిపక్షాల ఆశలు అడియాశలు అయ్యాయని , కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు  కకావికలం అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే కిషోర్ తో కలిసి మీడియా తో మాట్లాడిన మంత్రి  ,మూడోసారి వచ్చేది కేసీఆరే, గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే  అన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల కోసం కేసిఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా కు సకలజనుల ఆమోదం ఉందన్నారు.కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది ప్రజల భావన అన్నారు.తిరిగికేసీఆరే మూడోసారి సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష అన్నారు.తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రతిపక్షం లేదన్న మంత్రి  ప్రతిపక్షాలవి చిల్లర ప్రగల్భాలు వారు చేసే వ్యాఖ్యలు అర్థరహితం అవగాహానరాహిత్యం  అని ఆరోపించారు.75 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీలేఅన్న మంత్రి, వారు చేయాలేని అభివృద్ధి ని 10 ఏళ్ల లోనే కేసీఆర్ చేసి చూపించారని అన్నారు.కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ మహా అయితే 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న మంత్రి, ఉన్న మూడు నిలబెట్టుకోవడానికి బిజెపి అపసోపాలు పడుతోందన్నారు.కోతలు కోస్తున్న నేతలు కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.రాజకీయ జీవితం లో కేసీఆర్ లా ఓడిపోకుండా గెలిచిన‌ మొగోడు కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్  టీమ్  నంబర్ వన్ అన్న మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు గెలిచి కేసీఆర్ చేతిలో పెడతాం అన్నారు.వచ్చే ఎన్నికల కప్ ను గెలుచుకుని కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తాం అంటూ మంత్రి జగదీష్ రెడ్డి చలొక్తు లు విసిరారు.