తల్లి పాలు బిడ్డకు ఆరోగ్యకరం తల్లిపాలలో పసిబిడ్డకు కావలసిన పోషకాలు లభిస్తాయి

తల్లి పాలు బిడ్డకు ఆరోగ్యకరం తల్లిపాలలో పసిబిడ్డకు కావలసిన పోషకాలు లభిస్తాయి

 ముద్ర ప్రతినిధి: సూర్యాపేట తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరమని, అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని విజయక్ర్రష్ణ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆగస్టు 1 వ తేది నుంచి జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం నాడు స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలలో పది బిడ్డకు కావలసిన పోషకాలు లభిస్తాయని, పాలు ఇవ్వడం వలన బిడ్డతో తల్లికి అనుబంధం పెరుగుతుందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, లైన్స్ క్లబ్ ఆర్ సి గండూరి కృపాకర్, గేట్ కోఆర్డినేటర్ నూకల వెంకట్ రెడ్డి, క్లబ్ సభ్యురాలు కౌన్సిలర్ గండూరి పావని, క్లబ్ ప్రెసిడెంట్ బీరవోలు హైమావతి , సెక్రటరీ వెన్న కవిత, ట్రెజరర్ డాక విజయలక్ష్మి డి సి ఎన్ సి రోజా, మాజి ప్రెసిడెంట్ కోన ఆండాలు ,చార్టర్ మెంబర్ టి శ్రీదేవి ,పాస్ట్ ప్రెసిడెంట్ తన్నీరు ప్రమీల, బాలింతలు, ప్రతిష్ట ఫార్మడీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.