సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయి మూడు ర్యాంకు సాధించిన హుజూర్నగర్ విద్యార్థిని ఉమా హారతి

సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా స్థాయి మూడు ర్యాంకు సాధించిన హుజూర్నగర్ విద్యార్థిని ఉమా హారతి

హుజూర్ నగర్, ముద్ర: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన నూకల ఉమా హారతి ఆల్ ఇండియా స్థాయి సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించింది. మంగళవారం సివిల్ సర్వీస్ ఫలితాలను ప్రకటించగా ఉమా హారతి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఎంపిక అయింది. ఉమా హారతి ఒకటో తరగతి నుండి 10 వరకు హైదరాబాదులోని భారతి విద్యా భవన్లో చదివారు. ఇంటర్ నారాయణ కాలేజీలో. బిటెక్ హైదరాబాద్ ఐఐటి కళాశాలలో చదివింది. గత సంవత్సర కాలంగా ఢిల్లీలోని వాజీరాం ఐఏఎస్ అకాడమీలో సివిల్స్ కోచింగ్ తీసుకుని పరీక్ష రాసింది.

సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించింది. ఉమా హారతి తండ్రి ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సివిల్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించిన ఉమా హారతి మాట్లాడుతూ ఐఏఎస్తో తన కళ నెరవేరిందని అన్నారు.  తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తానని వారి ప్రోత్సాహంతోనే సివిల్స్ లో ర్యాంకు సాధించానని అన్నారు. చిన్ననాటి నుండి నాన్న ఎంతో కష్టపడి పోలీస్ ఉద్యోగం చేశారని, ఎస్పీ హోదాలో నాన్న  పని చేస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడని నాన్నస్ఫూర్తి సహకారం ప్రోత్సాహంతో ఐఏఎస్ సాధించినట్లు తెలిపారు. దేశంలోని ప్రజల కోసం ఒక మంచి చేరిన లక్ష్యంతో ఆలోచనతో ఉన్నానని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అట్టడుగు వర్గాలకు అందించడమే తన అధ్యయమని అన్నారు.