ట్రాన్స్‌జెండర్లకు యూనిక్‌ ఐడీ కార్డులను అందజేసిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ట్రాన్స్‌జెండర్లకు యూనిక్‌ ఐడీ కార్డులను అందజేసిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

 నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి:ట్రాన్స్ జెండర్లకు  ఉపాధి అవకాశాలు కల్పించాలి  ట్రాన్స్‌జెండర్‌(లింగమార్పిడి)లకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులను మంగళవారం కలెక్టర్ ఉదయ్ కుమార్ తన చాంబర్లో 7 మంది ట్రాన్స్ జెండర్లకు అందజేశారు.  https://transgender.dosje.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకున్న వారికి అందజేయుచున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్కు వివరించారు. ప్రతి దరఖాస్తుదారుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇచ్చి,దీని ద్వారా సాలర్‌షిప్‌లు, సిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంప్లాయ్‌మెంట్‌, కాంపోజిట్‌ మెడికల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టీజీ సర్టిఫికెట్‌, గుర్తింపు కార్డు వంటి సంక్షేమ పథకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు కలెక్టర్ తెలిపారు. ట్రాన్స్ జెండర్లకు యూనిక్ ఐడి కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.

సమాజంలో ఎలాంటి వివక్షకు గురి కాకుండా స్వయం శక్తితో రాణించేలా వారి వారి కులాల ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్ తో జీవనోపాధి కల్పించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందజేసే 50 వేల రూపాయల సదుపాయంతో మంచి వ్యాపారాలు చేసుకొని అభ్యున్నతి సాధించాలని కలెక్టర్ ఈ సందర్భంగా వారని కోరారు. ప్రభుత్వం తమను గుర్తించి సమాజంలో మనుషులందరితో సమానంగా జీవించి, ప్రభుత్వం నుంచి అందవలసిన అన్ని సహాయ సహకారాల్లో లబ్ధి పొందేలా అందజేస్తున్న ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులతో మా సమాజానికి మంచి జరుగుతుందని, మాకు కావలసిన సహాయ సహకారాలు అందించి మా అభ్యున్నతికి సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా పూలమాలతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని టి యు వెంకటలక్ష్మి, సఖి కోఆర్డినేటర్ సునీత, ట్రాన్స్ జెండర్స్ మల్లికా మహాలక్ష్మి, సుజిత, రాములమ్మ, నికిత, సాహి, మరియు ట్రాన్స్ జెండర్ ప్రాజెక్ట్ మేనేజర్ విజయలక్ష్మి, కౌన్సిలర్ పద్మ, నాయుడు  తదితరులు పాల్గొన్నారు.