ప్రజలే నా బలగం బంధువులు

ప్రజలే నా బలగం బంధువులు
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో దళారులదే రాజ్యం
  • సంక్షేమం అభివృద్ధిలో నెంబర్
  • మానవీయ కోణంలోనే సంక్షేమ పథకాలు
  • ఉమ్మడి జిల్లాలో ఐదు మెడికల్ కళాశాలలో విమర్శ పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలే నా బలగం నా బంధువులని వారి కోసమే మేఘో మధనం చేస్తూ మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని వాటివల్లే దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ప్రభుత్వం ప్రజల కోసం రైతులకు అధికారం కట్టబెట్టేందుకు తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ బిజెపి తోపాటు విపక్ష పార్టీల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల కాలంలో పెద్దనోట్ల రద్దు వల్ల ఒక సంవత్సరం నష్టపోవడం జరిగిందని మరికొంత కాలం కరోనా సమయంతో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తలసరి ఆదాయం అంశంలో రాష్ట్రం నెంబర్ వన్ లో ఉందని విద్యుత్ వినియోగంలో సంవత్సరానికి 50 వేల రూపాయలను సంక్షేమానికి ఖర్చు చేస్తూ సంక్షేమ బాటలో పయనిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందన్నారు. గతంలో వలసల జిల్లాగా పేరు ఉన్న పాలమూరు జిల్లాలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసే వారిని గంజి కేంద్రాలు పోయి నేడు గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పాటు మరో పది సంవత్సరాల పాటు తెలుగుదేశం బిజెపిలు కలిసి రాష్ట్రాన్ని పాలించిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి లేదని ప్రస్తుతం కొనసాగుతున్న అనేక పథకాలు ఎందుకు వారి ఆలయంలో ప్రవేశపెట్టలేదని నిలదీశారు. 

తెలంగాణ రాష్ట్రం సాధించడం వల్లే నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ప్రజల సౌకర్యం కోసం అనేక జిల్లా కార్యాలయాలకు  సొంత భవనాలు మంజూరు చేయడం జరిగిందని అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాకతీయుల కాలంలో రాష్ట్రంలో 75 వేల చెరువులు కుంటలు ఉండేవని గత పాలకుల వల్ల చెరువులు కుంటలు ధ్వంసం అయ్యాయని మళ్లీ వాటికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల నేడు అన్ని చెరువులన్నీ నీటితో కలకలలాడుతున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం పర్యాటక కేంద్రంగా మారిందని అన్నారు ప్రాజెక్టును పూర్తి చేసి చెక్ డాంల నిర్మించడం వల్ల 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.

ఈ జిల్లాకు చెందిన ఒక నేత ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఇటీవల ఒక బహిరంగ సభలో పేర్కొనడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు రైతులకే అధికారాన్ని కట్టబెట్టెందుకే ధరణి పోర్టల్ ను తీసుకురావడం జరిగిందని దీనివల్ల రైతుబంధు రైతు బీమా ధాన్యం కొనుగోలులకు బిల్లులు వారి ఖాతాలలో నేరుగా జమవుతున్నాయని అన్నారు. ధరణి పోర్టల్ రాకముందు సంబంధిత అధికారులు రైతులను అనేక ఇక్కట్లు పెట్టేవారని నేడు అలాంటివేమీ లేకుండా ఒకే ఒక్క వేలిముద్రతో అమ్మకం దారి నుండి కొనుగోలుదారులు పేరు మీదికి భూమి మారడంతో పాటు వెంటనే పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు రైతు రాజ్యం అని ధరణి పోర్టల్ రావడం వల్ల గ్రామాలలో ప్రశాంతత ఏర్పడిందని అన్నారు. 

రాబోయే రోజుల్లో గృహ పథకానికి నిధులను మంజూరు చేయడం జరిగిందని ప్రతి నియోజకవర్గంలో 4 ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఉచిత విద్యుత్తును రైతులకు అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని అన్నారు. గిరిజనుల పౌలు భూమి సమస్యను పరిష్కరిస్తామని ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఉన్న రైతులు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు మంత్రులకు సమస్యను వివరిస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో మేఘోమధనం చేయడం ద్వారానే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నాటికి నీటిని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ బహిరంగ సభలో జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు జిల్లా పరిషత్ చైర్మన్ శాంతా కుమారి ప్రసంగించగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆల వెంకటేశ్వర్ రెడ్డి జైపాల్ యాదవ్ అబ్రహం కృష్ణమోహన్ రెడ్డి అబ్రహం లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి గోరేటి వెంకన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంపీ రాములు మాజీ ఎంపీ జగన్నాథ్ డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు.