నాగర్ కర్నూల్ జిల్లాలో 45 మంది హాస్టల్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

నాగర్ కర్నూల్ జిల్లాలో 45 మంది హాస్టల్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
  • 45 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
  • పదిమంది విద్యార్థినిలకు పరిస్థితి విషమం
  • మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రథమ చికిత్స

ముద్ర, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా  అమ్రాబాద్ మండలం మన్ననూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 45 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రథమ చికిత్స శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో విద్యార్థులను 10 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు. 250 మంది విద్యార్థినిలు ఉన్న పాఠశాలలో గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో విద్యార్థినిలు భోజనం చేసిన అనంతరం వారికి ఒక్కొక్కరికి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో వారిని హుటాహుటిన మన్ననూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. అనంతరం వారిలో కొందరి  పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 10 మంది విద్యార్థుల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నట్టుండి ఒక్కసారిగా 45 మంది విద్యార్థులకు తీవ్ర గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు. ఒకేసారి 45 మంది విద్యార్థులకు అశ్వసత అన్న విషయం ధారాళంగా వ్యాప్తి చెందడంతో అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి విద్యార్థిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు  అస్వస్థతకు గురైన తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హుటాహుటిన సిద్ధాపూర్ నుండి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చి వారికి స్వయంగా వైద్య సేవలను అందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను తరలించడానికి నియోజకవర్గం లోని 108 అంబులెన్సులు సరిపోకపోవడంతో ప్రైవేట్ వాహనాలను మరియు లారీలో విద్యార్థినులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా బయట వారి తల్లిదండ్రులు బంధువులు ఆందోళనతో ఉన్నారు.