వరి ధాన్యం కొనుగోలు అవకతవకలపై జూపల్లి ధర్నా

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: వరి ధాన్యం కొనుగోలు లో జరుగుతున్న అవకతకులపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేటను ముట్టడించారు. కొల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం విషయంలో క్వింటాలకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను మోసగించడాన్ని తీవ్రంగా వ్యాపారుల తరహాలో ప్రభుత్వమే మోసాలు చేస్తూ కొనుగోలు చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం వరి కొనుగోలు లో అక్రమాలను ఖండిస్తూ జూపల్లి కృష్ణారావు ఆ ప్రాంత రైతులతో కలిసి కలెక్టరేట్ కు తరలివచ్చాడు. కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించి భీష్మించుకొని కూర్చున్నారు.తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు లో జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేపట్టి కార్యాలయ పనులను స్తంభింపజేశారు. రైతులకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదంటూ భీష్పించుకొని కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ దిగిరావాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే సహించమని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేపట్టేందుకు జూపల్లి తరలివస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించారు.